ఉక్రెయిన్ దేశంపై రెండో రోజు యుద్ధం చేస్తున్న రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైన్యం లొంగిపోతే, చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. అణచివేత నుంచి విముక్తి పొందిన ఉక్రేనియన్లు తమ భవిష్యత్తును స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చని చెప్పారు. కాని ఉక్రెయిన్ సైన్యాలు దాడికి దిగితే ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. ఈ పిలుపునకు ఉక్రెయిన్ బలగాలు స్పందించి ఆయుధాలు విడిచిన వెంటనే, తాము ఏ క్షణంలోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని లావ్రోవ్ మాస్కోలో వెల్లడించారు.