ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రపంచదేశాలన్నీ పుతిన్ పై గుర్రుగా ఉన్నాయి. ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. పలుమార్లు ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు కూడా జరిగాయి. అయినా కూడా లాభం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంక్షోభానికి తాము పరిష్కారాన్ని వెతుకుతుంటే ఉక్రెయిన్ మాత్రం శాంతి చర్చలను అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు జర్మన్ ఛాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ఫోన్ లో సంభాషించిన పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.