రష్య జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. డాన్టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు తెలిపింది. ఉక్రెయన్ సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లపై దాడులు చేశామని పేర్కొంది. ఒక రెసిడెన్సీలో 700 మంది సైనికులు ఉంటే 600 మందిని రాకెట్ దాడుల్లో మట్టుబెట్టినట్లు వివరించింది.