ఉక్రెయిన్‌పై యుద్దంలో భాగంగా రష్యా బలగాలు మారియుపోల్ తూర్పు పొలిమేరలను స్వాధీనం చేసుకున్నాయని, వ్యూహాత్మక నౌకాశ్రయంపై తమ ముట్టడిని కఠినతరం చేశారని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యన్ సైనికులు 24గంటలూ బాంబులు, క్షిపణులతో దాడి చేస్తున్నారని అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. శరణార్థుల కాన్వాయ్‌పై కాల్పులు జరపడంతో ఒక చిన్నారి సహా ఏడుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌కు ఈశాన్యంగా 20కిమీ (12 మైళ్లు) దూరంలో ఉన్న పెరెమోహా గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన వందలాది మందిలో మృతి చెందిన ఈ ఏడుగురు ఉన్నారు. మారియుపోల్‌లో 1,500 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది.