AP: రుయా ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం..అధికారి సస్పెండ్

© File Photo

తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా వారు ప్రవర్తించిన తీరు అందరి చేత చీవాట్లు పెట్టిస్తోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన 10 సంవత్సరాల కొడుకును ఆసుపత్రికి తీసుకురాగా.. అతడి పరిస్థితి విషమించి మరణించాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.20,000 డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి రూ.5,000 కు ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకువచ్చినా కానీ ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లు అందులో కూడా అతడిని వెళ్లనివ్వలేదు. ఇక చేసేదేం లేక ఆ వ్యక్తి తన కొడుకు శవాన్ని భుజం మీద వేసుకుని బైక్‌పై ఊరెళ్లిపోయాడు. ప్రస్తుతం ఏపీలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుపత్రికి చెందిన ఆర్ఎంవోను సస్పెండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Exit mobile version