రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా వచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి మొదటి సినిమా ‘RX 100’తో భారీ హిట్ కొట్టాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి విజాయాన్ని సాధించింది. కానీ సిద్ధార్థ్, శర్వానంద్‌తో తీసిన రెండో సినిమా ‘మహా సముద్రం’ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో టాలీవుడ్‌లో హీరోలెవరు ఈ దర్శకుడికి డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరట. ఇక లాభం లేదనుకున్న అజయ్ భూపతి తెలిసిన వాళ్ల ద్వారా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమర్ హిరాణిని కలిశాడు. ఆయన రాసుకున్న 2 కథలను వినిపించగా అవి హిరాణికి నచ్చినట్లు తెలుస్తుంది. దీంతో రాజ్‌కుమార్ హిరాణి ఆద్వర్యంలో అజయ్ భూపతి హిందీలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.