స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ బుధవారం ఏప్రిల్ 7 నుండి 16 వరకు జరగనున్న I నుండి IX తరగతుల సమ్మేటివ్ అసెస్మెంట్ (SA) II పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. VI, VII తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.45 వరకు, 9వ తరగతి వారికి ఉదయం 10 నుంచి 12.45 వరకు (పేపర్-1), మధ్యాహ్నం 2 నుండి 4.45 వరకు (పేపర్-II) పరీక్షలు నిర్వహిస్తారు.