న్యూజిలాండ్తో వన్డేలో గిల్ చెలరేగి ఆడిన తర్వాత సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. సచిన్ తెందూల్కర్ తన కూతురు సారాతో గిల్ నిశ్చితార్థాన్ని ప్రకటించారంటూ ట్విట్టర్లో ఓ బ్రేకింగ్ న్యూస్ చక్కర్లో కొడుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. గిల్, సారా ప్రేమలో ఉన్నట్లు గతంలో అనేక వార్తలు వచ్చాయి. దీంతో ఈ పుకారు పుట్టించారు. ఉప్పల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా సచిన్ పేరిట ఉన్న 186 పరుగుల రికార్డును గిల్ ఇవాళ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.