విరాట్ కోహ్లీ మరో మాట లేకుండా ఈ తరం క్రికెటర్లలో మేటి ఆటగాడు. అలాగే భారత క్రికెట్లో దేవుడిగా భావించే ఆటగాడు సచిన్ తెందూల్కర్. నిత్యం వీరిద్దరి మధ్య పోలికలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరిలో ఎవరు బెట్టర్ బ్యాటర్ అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. ఇదే ప్రశ్న 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్‌ను అడిగినప్పుడు చాలా చక్కటి జవాబిచ్చారు. “ ప్రతి తరం మరింత మెరుగవుతూనే వస్తుంది. మా కాలంలో సునీల్ గావస్కర్ చక్కటి బ్యాటర్. ఆ తర్వాత ద్రావిడ్, సచిన్,సెహ్వాగ్ ఇలా ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు రోహిత్ ,కోహ్లీ ఇలా చక్కటి ఆటగాళ్లున్నారు. తర్వాతి తరం వీరికన్నా మెరుగైన నైపుణ్యంతో ఉంటుంది.” అంటూ కపిల్ దేవ్ సమాధానమిచ్చాడు.