సైబర్ మోసాలు అరికట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఇక నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు ఈ-మెయిల్‌కు పంపిన ఓటీపీని ఉపయోగిస్తేనే ట్రాన్సాక్షన్ జరిగే విధంగా ఆప్షన్ తెచ్చింది. ఇప్పటివరకు కేవలం ఫోన్‌కు పంపే ఓటీపీ ద్వారానే సేవలు వినియోగించారు. ఇందుకోసం అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఈ-మెయిల్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్‌ను మరింత సురక్షితంగా చేసుకునే విధంగా రూపొందించామని వెల్లడించింది.