బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ రెమ్యునరేషన్ రూ.5 కోట్లు పెంచాడట. ఇటీవల ఆయన నటించిన జెర్సీ మూవీ హిందీలో డిజాస్టర్ అయింది. మొత్తం రూ.20 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కానీ జెర్సీ సినిమాకు షాహిద్ రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. తర్వాత చేస్తున్న మూవీ కోసం రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పటికీ షాహిద్ అంతకుముందు నటించిన పద్మావత్, కబీర్ సింగ్ సినిమాలతో మంచి సక్సెస్ సాధించాయి. ఈ కారణంగానే ఈ హీరో రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేసినట్లు తెలుస్తుంది.