యంగ్ హీరో సాయి ధరమ్ తేజ రోడ్డు ప్రమాదం తర్వాత 6 నెలలు గ్యాప్ తీసుకొని తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. కార్తిక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ నిర్మాణంలో తేజ్ 15 సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ నిన్న ప్రారంభమైంది. అయితే అతడు ప్రమాదం నుంచి కోలుకొని సెట్స్‌లో అడుగుపెట్టడంతో చిత్రబృందం అతడికి సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు. నాకు ఇంత బాగా వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.