ఓటీటీలో వ‌చ్చేస్తున్న సాయిప‌ల్ల‌వి ‘గార్గి’

సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘గార్గి’. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు గార్గి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఆగ‌స్ట్ 12 నుంచి సోనీలివ్ ఓటీటీలో తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌లో స్ట్రీమింగ్ కానుంది. తండ్రి కోసం కూతురు చేసే న్యాయ‌పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు దక్కాయి. తెలుగులో ఈ చిత్రాన్ని రానా, త‌మిళ్‌లో సూర్య‌, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి ప్రెజెంట్ చేశారు.

Exit mobile version