హీరోయిన్ సాయిపల్లవి గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. తన సొంతూరు కోయంబత్తూరులో ఆస్పత్రి కట్టించనున్నట్లు సమాచారం. సాయిపల్లవి నటనకు స్వస్తి చెప్పి వైద్య వృత్తిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా సాయిపల్లవి డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయిపోయింది. ఆమె జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకుంది. అనుకోకుండా సినిమా రంగంలో అడుగు పెట్టింది.