టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి త్వరలోనే నిర్మాతగా మారే చాన్స్ ఉంది. తాను నిర్మాతగా మారనున్నట్లు స్వయంగా సాయిపల్లవే ప్రకటించడం గమనార్హం. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన గార్గి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ… తనకు నచ్చిన కథ వస్తే నటించడంతో పాటుగా నిర్మిస్తానని వెల్లడించారు. దీంతో సాయిపల్లవి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ ఇంకా అందుకు చాలా సమయం ఉందని అమ్మడు పేర్కొంది. ఇప్పటికే చాలా మంది తారలు నిర్మాతలుగా మారిన విషయం తెలిసిందే.
© File Photo
© File Photo