నిన్న సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అప్‌డేట్స్‌ని ప్రకటించింది. ప్రస్తుతం ‘గార్గి’ అనే ఒక సినిమాతో పాటు, శివకార్తికేయన్ 21వ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం కమల్ హాసన్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సాయి పల్లవి సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసింది. కమల్ హాసన్‌ను కలిసి ఉత్తమ నటీగా మారేందుకు సలహాలను తీసుకున్నాను. ఈ మీటింగ్ నాకెంతో స్పెషల్ అంటూ పోస్ట్ చేసింది.