తెలుగు యాక్ట్రస్ సాయిపల్లవి గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్లో సాయిపల్లవి హవా నడుస్తోంది. తాజాగా సాయిపల్లవికి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. సాయిపల్లవి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ ప్రముఖ ఫేస్ క్రీమ్ కంపెనీ ఆమెకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. కానీ ఈ ఆఫర్‌ను సాయిపల్లవి సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.