’ఎస్ఎస్ఎంబీ28‘ సినిమాకు సంబంధించి సూపర్‌స్టార్ మహేష్ బాబుకు విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సైఫ్ ఆలీఖాన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. ఈ చిత్రంలో సైఫ్ నటిస్తే బాలీవుడ్ నుంచి భారీ అంచనాలు నెలకొంటాయి. కాగా ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
-
Screengrab Instagram: MAHESHBABU -
Screengrab Instagram: actorsaifalikhan