టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయిపల్లవి నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘గార్గి’ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో పాటు మేకింగ్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో న్యాయం కోసం పోరాడే ఒక అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఐశ్వర లక్ష్మీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు.