ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యన్లతో పోరాడుతున్న సాయినికేశ్ తిరిగి స్వదేశానికి రావాలనుకుంటున్నట్లు తమిళనాడుకి చెందిన అతడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సాయినికేశ్ ఏరో స్పేస్ ఇంజినీరింగ్ చదివేందుకు 2018లో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో గల నేషనల్ ఏరో స్పేస్ యూనివర్సిటీలో చేరారు. ఈ నేపథ్యంలోనే రష్యా సైన్యం దాడులకు పాల్పడటంతో ఉక్రెయిన్ ఆర్మీకి సాయం చేసే జార్జియన్ నేషనల్ లెజియన్‌లో చేరి అక్కడే ఉన్నాడు. దీంతో అతడు స్వదేశానికి రావాలని తల్లిదండ్రులు వేడుకోవడంతో అతడు అందుకు అంగీకరించాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.(Representational Image)