బతుకమ్మ ఆడలేదని జీతాలు కట్ చేసిన సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కొందరు అంగన్వాడీ ఆయాల వేతనాలు నిలిపివేశారు. మరికొందరికి కోతలు విధించారు. కొన్ని వర్గాల మహిళలు తమ మతాలకు బతుకమ్మ వ్యతిరేకమని కారణంతో వారు బతుమ్మలో పాల్గొనలేదు. వారి వేతనాల్లో రూ.300 చొప్పున మినహాయించినట్లు తెలుస్తోంది. నెలకు వచ్చే జీతం రూ.7800 నుంచి రూ.300 కోత పెడితే తాము ఎవరికి చెప్పుకోవాలని మహిళలు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
బతుకమ్మ ఆడలేదని జీతాలు కట్!

© ANI Photo(representational)