• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జీతం రూ.30 వేలు.. ఆస్తులేమో రూ.7 కోట్లు

    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేసే హేమ మీనాపై అవినీతి ఆరోపణలు రాగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. భోపాల్‌ జిల్లా బిల్ఖిరియాలోని మీనా నివాసంతో పాటు, మరో మూడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ. 7 కోట్ల ఆస్తులను గుర్తించారు. నెలకు రూ.30 వేలు జీతం తీసుకునే మీనాకు 7 లగ్జరీ కార్లు సహా 20 వాహనాలు, విలాసవంతమైన భవనం, రూ.30 లక్షల విలువచేసే టీవీ, 24 ఆవులు, 100 పెంపుడు కుక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv