మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. చిరంజీవితో ఉన్న సన్నిహితంతోనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.