టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉంది సమంత. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ గురించి స్పందించారు. నాకు సోషల్‌మీడియాలో ఉండటం ఇష్టం. నా ఆలోచనలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటాను. కొన్నిసార్లు దారుణంగా ట్రోల్ చేస్తారు. మొదట వాటి గురించి చాలా బాధపడేదాన్ని. రాత్రిళ్లు నిద్రకూడా పట్టకపోయేది. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశాను. మనం ఏం చేసినా అనేవాళ్లు అంటూనే ఉంటారు. అయితే కొంతమంది నిజాయితిగా చెప్తుంటారు. అలాంటి వాళ్ల మాటలు విని నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చింది.