హిట్ సిరీస్‌లో సమంత లాంటి ఓ మహిళా కథానాయిక కూడా ఉంటే బాగుంటుందనే చర్చ నడుస్తున్న క్రమంలో హీరో అడివి శేష్ స్పందించాడు. ‘చాలా మంచి ఆలోచన.. దీనికి నువ్వేమంటావ్ సామ్’ అని శేష్ ట్విటర్లో సమంతను ట్యాగ్ చేశాడు. ‘ఓ మొరటు పోలీసు అధికారి గమ్మత్తుగా మాట్లాడుతున్నాడేంటి’ అని బదులిస్తూ సమంత సానుకూలంగా తోసిపుచ్చింది. చిత్రం విజయం సాధించినందుకు శేష్‌కి సామ్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటోంది. ‘హిట్- ద సెకండ్ కేస్’ సినిమాలో హీరో అడివి శేష్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫస్ట్ కేస్‌లో విశ్వక్సేన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. హిట్ 3లో కూడా హీరో ఎవరనే విషయాన్ని రివీల్ చేశారు.