యశోద సినిమాలోని సీన్‌ని తలపించేలా మధ్యప్రదేశ్‌లోనూ ఓ ఘటన జరిగింది. మెడికల్ మాఫియా గుట్టు విప్పడానికి పోలీసు ట్రెయినీ అయిన సమంత బాధితురాలిగా వెళ్తుంది. అలాగే మధ్యప్రదేశ్‌లోని మహాత్మాగాంధీ మెమొరియాల్ మెడికల్ కళాశాలలోనూ ర్యాగింగ్ భూతాన్ని అంతమొందించడానికి విద్యార్థి అవతారమెత్తిందో పోలీసు అధికారిణి. 24ఏళ్ల షాలినీ చౌహాన్ ఈ సాహసం చేసింది. 3 నెలల పాటు సాధారణ విద్యార్థిలా క్యాంపస్‌లో కలియ తిరుగుతూ ర్యాగింగ్ చేస్తున్న 11మంది సీనియర్ విద్యార్థులను పట్టించింది. దీంతో కళాశాల యాజమాన్యం వీరిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. షాలినీ చేసిన సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.