సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ ఫస్ట్ లుక్ నిన్న విడుదలైంది. పోస్టర్లో సమంత చాలా అందంగా కనిపించింది. ఆమెను ప్రశంసిస్తూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెట్టారు. అయితే ఈ సందర్భంగా నిన్న సమంత ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాలో Q&A సెషన్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఒక నెటిజన్ ‘wanna reproduce you’ అని అడిగిన ప్రశ్నకు ఆమె మండిపడింది. మొదట reproduce అనే పదాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకో అని రిప్లై ఇచ్చింది. ఇక మీరు నంబర్ వన్ యాక్టర్ అని నమ్ముతారా అని అడిగితే, నేను అలాంటివి నమ్మను కాని స్థిరంగా పనిచేస్తుంటానని చెప్పింది. ప్రస్తుతం విల్‌స్మిత్ రాసిన ‘విల్’ బుక్ చదువుతున్నట్లు వెల్లడించింది. సామ్‌కు ఇష్టమైన జానర్ కామెడీ అని పేర్కొంది.