తెలుగులో చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవల మహాసముద్రం సినిమాలో నటించాడు హీరో సిద్ధార్థ్. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం సమంతను సంప్రదించారట మేకర్స్. కానీ ఆమె నిర్మొహమాటంగా నో చెప్పిందని సమాచారం. ఎందుకంటే పెళ్లికి ముందు సమంత, సిద్ధార్థ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఏవో కారణాలతో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్యతో వివాహం జరిగింది. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకుల సమంయలో కూడా సిద్ధార్థ్ పరోక్షంగా సమంతపై కామెంట్స్ చేశాడు.