టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ లో కూడా సమంత స్టార్ డమ్ తో దూసుకుపోతోంది. ఈ బ్యూటీ గతేడాది యంగ్ హీరో నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుంది. ఆ సమయంలో సమంత మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. విడాకుల తర్వాత ఈ బ్యూటీ ఓ సినిమాలో హిట్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ఎంతో పెద్ద హిట్‌గా నిలిచింది. అయినప్పటికీ కొంత మంది సమంత ఇలాంటి సాంగ్ చేయడంపై సోషల్ మీడియాలో నెగెటివ్ గా స్పందించారు. ఈ నెగెటివ్ కామెంట్లు మొదట్లో తనను చాలా బాధించాయని, వీటి వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని, కానీ ప్రస్తుతం ఇటువంటి కామెంట్ల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని సామ్ తెలిపింది. సామ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది.