టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మీ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని చింతించకుండా ఆమెను శక్తివంతంగా తీర్చిదిద్దండి. పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టడానికి బదులు ఆమె చదువుపై ఖర్చుపెట్టండి. ముఖ్యంగా పెళ్లికి ఆమెను ప్రిపేర్ చేయడానికి బదులు.. తన కాళ్లపై తాను నిలబడగలిగేలా చేయండి. తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం నేర్పించండి’’ అని అందులో ఉంది. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన ఈ పోస్ట్‌ని సామ్ షేర్ చేశారు. సమంత నటించిన ‘కాతువక్కుల రెందు కాదల్’, ‘శాకుంతలం’ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. మరో రెండు సరికొత్త ప్రాజక్ట్స్‌ని ఓకే చేశారు. అవి ప్రారంభమయ్యే గ్యాప్‌లో ఆమె హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా చార్ధామ్ యాత్ర పూర్తిచేసిన ఆమె..నిన్న దుబాయ్ వెళ్తున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.