టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత మరో ఐటమ్ సాంగ్ లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఎక్కడ లేని క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి- రణ్బీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో కూడా ఈ భామ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐటమ్ సాంగ్ కోసం అనేక మందిని సంప్రదించిన మేకర్స్ సమంత వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఆఫర్ ను సమంత యాక్సెప్ట్ చేస్తుందో? లేదో వేచి చూడాలి.