కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం ఢిల్లీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోని పక్షంలో భారత్-చైనా సంబంధాలు సాధారణ స్థితికి రావని తెలిపారు. సరిహద్దు సమస్య గురించి వాంగ్ యితో చర్చించామని, సరిహద్దు విషయంలో ఇండియాకు కావాల్సిందేంటో కూడా వివరించామని పేర్కొన్నారు. ఎలాంటి ఉమ్మడి ఒప్పందాలు లేకుండానే చర్చలు ముగిశాయని వెల్లడించారు.