టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక సమంతకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి సమంతకు కంపెనీలు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయట. సమంత ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్ పెట్టగానే అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇలా సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను సామ్‌తో ప్రమోట్ చేపిస్తున్నాయట. ఇందు కోసం ఆయా కంపెనీలు కూడా భారీగానే ముట్ట జెబుతున్నట్లు సమాచారం అందుతోంది. సామ్ ఇలా ఇన్‌స్టా ప్రకటనల ద్వారానే నెలకు రూ.2 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు టాక్.