సమోసా.. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఫుడ్ ఐటమ్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆలూ సమోసా, ఆనియన్ సమోసా, చీజ్ సమోసా.. ఇలా రకరకాలు పేర్లు పెట్టి అమ్మేస్తుంటారు. నలుగురు స్నేహితులు కలిస్తే.. మాంచి మసాలా చాయ్ తో పాటు ఈ సమోసా ఉండాల్సిందే. అలాంటి ఈ సమోసా ఖరీదు మహా అంటే రూ.10లోపే ఉంటుంది. కాస్త పెద్దదైతే రూ.20, 30 లలో దొరుకుతుంది. కానీ, ఢిల్లీలోని మిస్టర్ చాయ్ అనే హోటల్లో దొరికే సమోసా ఖరీదు అక్షరాలా రూ.900. రకరకాల వెరైటీలలో అక్కడ వీటిని తయారు చేస్తారట. అందుకే వీటికి అంత ఖరీదు కావచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఢిల్లీకి వెళితే సమోసా తప్పక తినండి.