భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సముద్రయాన్ ప్రాజెక్టు ‘మత్య్స 6000’ లో భాగంగా తొలి అడుగు పడింది. తొలుత సముద్రంలోని 500 మీటర్ల లోతుకి ముగ్గురు ఆక్వానాట్స్ని పంపిస్తోంది. ఈ మేరకు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇంజినీర్లు ఉక్కు గోళాన్ని తయారు చేశారు. వాస్తవానికి సముద్రంలో 6000 మీటర్ల లోతులో పరిశోధనలకు గాను ప్రభుత్వం సంకల్పించింది. కానీ, ఇందుకు కావాల్సిన టైటానియం గోళం ఇంకా సిద్ధం కాలేదు. దీంతో 500 మీటర్ల లోతులో పీడనాన్ని తట్టుకోగల ఉక్కు గోళాన్ని చెన్నై టెకీలు రూపొందించారు. ఈ ఏడాదే సముద్రయాన్ మిషన్ ప్రారంభం కానుంది.