‘భీమ్లా నాయక్’ సినిమా ప్రమోషన్స్‌లో నిత్యా మీనన్ అసలు కనిపించలేదు. ఎడిటింగ్‌లో భాగంగా ఆమె నటించిన సీన్లను కట్ చేసినందుకు, దాంతో పాటు అంత ఇష్టం అనే పాటను కూడా తొలగించినందుకు ఆమె హర్ట్ అవడంతో ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని టాక్ వినిపించింది. తర్వాత భీమ్లా నాయక్‌లో రానా భార్యగా నటించిన సంయుక్త మీనన్ విషయంలో కూడా అవే వార్తలు వినిపించాయి. అయితే నేను హర్ట్ అయిన మాట నిజమే కానీ నా పాత్రను తగ్గించినందుకు కాదు. భీమ్లా నాయక్ సినిమా రెండోసారి చూసేందుకు టిక్కెట్లు లభించకపోవడం వల్ల హర్టయ్యాను అని చెప్పింది.