అఫ్గానిస్థాన్‌లో మహిళా హక్కులకు ఆంక్షలు విధించడాన్ని తాలిబన్ నేతలు సమర్థించుకున్నారు. మహిళల హక్కుల సంరక్షణ తమ ప్రాధాన్యత కాదని తాలిబన్లు స్పష్టం చేశారు. షరియా చట్టం ప్రకారమే అఫ్గాన్‌లో పాలన కొనసాగిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలపై ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘మహిళ హక్కుల సంరక్షణ మాకు ప్రాధాన్యత కాదు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాం. దేశంలో ఇస్లామిక్ చట్టాన్ని అతిక్రమించే ఏ చర్యనైనా అనుమతించబోం’ అని స్పష్టం చేశారు. ఈ కారణంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌ని ఆస్ట్రేలియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.