సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు. వెకేషన్ పూర్తయ్యాక త్రివిక్రమ్‌తో మూవీ చేయనున్నారు. ఆ తరువాత రాజమౌళి క్యాంపులో జాయిన్ కానున్నాడు. అయితే తాజాగా మహేష్ గురించి మరో వార్త వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డితో మూవీ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలు కథలు వినిపించారని అవి మహేష్‌కు కూడా నచ్చాయని త్వరలోనే మూవీ సెట్స్‌పై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: