RRR మూవీ ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలను చర్చించారు. రాజమౌళి ఈగ మూవీ తీస్తున్న సమయంలో తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరేందుకు ప్రయత్నించానని,. అందుకు అవకాశం లభించలేదని సందీప్ తెలిపాడు. ఇప్పటికైనా తర్వాత మూవీలో కనీసం 20 నుంచి 25 రోజులు తనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వాలని జక్కన్నను కోరాడు. అందుకు జక్కన్న ఏమన్నాడో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.