భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని తెలిపారు. ఆస్ట్రేలియా ఓపెన్, దుబాయ్ ఓపెన్ తర్వాత ఆటకు స్వస్థి చెబుతున్నానని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఈ టోర్నీలే తనకు చివరివంటూ మూడు పేజీల నోట్‌ను ఉంచారు. సానియా ఆమె కెరీర్లో ఎన్నో కీలక మైలురాళ్లను అందుకుంది. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది సానియా.