ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలివుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీని ముంబయి వెళ్లి కలిశారు. బన్నీ భన్సాలీ ఆఫీసులోకి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారా లేదా సాధరణ సమావేశమేనా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ ఎప్పటిలాగే స్టైలిష్గా టోటల్ బ్లాక్ డ్రెస్లో కనిపించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2’ లో నటిస్తున్నాడు. భన్సాలీ ఇటీవలే ‘గంగూబాయి’ సినిమాతో మరో సక్సెస్ సాధించాడు.