టీమిండియాను గాయాల బెడద వదలట్లేదు. తాజాగా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ జట్టుకు దూరమయ్యాడు. రేపు జరగబోయే రెండో టీ20కి సంజు అందుబాటులో ఉండట్లేదు. శ్రీలంకతో మ్యాచులో సంజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. మోకాలి గాయంతో సంజు ఇబ్బంది పడ్డాడు. దీంతో రెండో టీ20 కోసం జట్టుతో పుణె వెళ్లకుండా స్కానింగుల కోసం ముంబైలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సంజు స్థానంలో విదర్భ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జితేశ్ శర్మని జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, రెండో టీ20లో సంజు స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం