సంక్రాంతి పండుగ విరాట్‌కు బాగా కలిసొస్తుంది. ఎందుకంటే జనవరి 15న విరాట్ సెంచరీ చేయడం ఇది నాలుగోసారి. శ్రీలంకతో మూడో వన్డేలో కోహ్లీ 166 పరుగుల చేసి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, 2017, 2018, 2109లోనూ విరాట్ ఈ రోజున సెంచరీలు చేయడం విశేషం. 2020, 2022ల్లో భారత్ సంక్రాంతి రోజున మ్యాచ్ ఆడలేదు. 2021లో ఆడినప్పటికీ.. ఆ జట్టులో విరాట్ కోహ్లీ లేడు. దీంతో వరుసగా 4 సంక్రాంతి పర్వదినాల రోజున సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. కాగా, ఈ మ్యాచులో 317 పరుగుల తేడాతో భారత్ రికార్డు విజయం సాధించింది.