ముంబై రంజీ బ్యాటర్ సర్ఫరాజ్ మధ్యప్రదేశ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. రంజీ ఫైనల్ మ్యాచులో ముంబై జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయాలన్న మధ్యప్రదేశ్ బౌలర్ల కల తీరకుండా చేస్తున్నాడు. ఆ జట్టు 228 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయినా కానీ సర్ఫరాజ్(65*) మాత్రం లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సాయంతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ముంబై జట్టు రెండో రోజు మొదటి సెషన్ లో 103 ఓవర్లు ముగిసేసరికి 288 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.