అంచ‌నాల‌ను మించిపోయిన ‘స‌ర్కారు వారి పాట’ బ‌డ్జెట్‌

‘స‌ర్కారు వారి పాట’ సినిమా మ‌హేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమా. అయితే ముందు వేసుకున్న అంచ‌నాల కంటే ఈ సినిమా బ‌డ్జెట్ మ‌రింత పెరిగిపోయింద‌ట‌. కానీ అదంతా ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా మ‌ళ్లీ వెన‌క్కి వ‌స్తుంద‌నే న‌మ్మకంతో ఉన్నార‌ట మేక‌ర్స్‌. ఇప్ప‌టికే నాన్-థియేట్రిక‌ల్ రైట్స్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Exit mobile version