టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమర్ సంధు ఏకంగా 4.5 రేటింగ్ ఇచ్చాడు. అంతేకాదు 2022లో తనకు ఈ మూవీనే బెస్ట్ అంటు చెప్పాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు చాలా అందంగా కనిపించాడని, స్టైలిష్ డ్రెస్సింగ్ బాగుందన్నాడు. మరోవైపు మూవీలో మహేష్ ఎంట్రీ సీన్ సూపర్ గా ఉందన్నాడు. ఫస్ట్ హాఫ్ కూడా అదిరిందని, ఇక సూపర్ స్టార్ యాక్టింగ్ తో పాటు కోపం కూడా ప్రదర్శించినట్లు గుర్తు చేశాడు. దీంతో సర్కారు వారి పాట మూవీ థియేటర్ స్క్రీన్లను కాల్చేస్తుందని ఉమర్ సంధు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.