తెలుగు రాష్ట్రాల్లో గతంలో టెక్కెట్ల రేట్లు పెంచాలని పలుమార్లు టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వ సీఎంలను కలిశారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పెరిగిన టిక్కెట్ల రేట్లతో మధ్యతరగతి ప్రజలు థియేటర్లకు తక్కువగా వస్తున్నట్లు సమాచారం. దీంతో మొదటి వారం తర్వాత ఎక్కువగా సినిమాలు చూసేందుకు అడియోన్స్ రావడం లేదని తెలుస్తోంది. ఓటీటీలో వచ్చాకా చూద్దాం అనే ధోరణితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎఫ్3 మూవీకి కూడా టిక్కెట్ల రేట్లు పెంచడం లేదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే కోవలోకి నిన్న విడుదలైన సర్కారు వారి పాట మూవీ చేర్చాలని పలువురు కోరుతున్నట్లు టాక్. మరి నిర్మాతలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.