‘సర్కారు వారి పాట’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తుంది. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.11.64 కోట్లు వసూలు చేసింది. రెండు రోజుల మొత్తం కలెక్షన్లు ఏపీ, తెలంగాణలో రూ. 48 కోట్లు రాబట్టింది. అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ఈ వీకెండ్‌లో రెట్టింపు కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.