సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన కళావతి సాంగ్ కొత్త రికార్డులు రాసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఈ పాటను 97 మిలియన్లపై చిలుకు జనం తిలకించారు. అంతే కాకుండా 1.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఈ పాటకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూర్చగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.