సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం తెరకెక్కించిన మూవీ ‘సర్కారు వారి పాట’. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. థియేటర్లో ఈ సినిమాను చూడని వాళ్లు ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రెంటల్ విధానంలో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుండగా.. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు ఉచితంగా జూన్ 23వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్, మూవీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.